RBI New ATM Rules 2026: ఫ్రీ లిమిట్ దాటితే రూ.23 ఛార్జీ.. బ్యాంకుల అలర్ట్ తప్పనిసరి!

Published On: November 28, 2026
Follow Us
RBI New ATM Rules 2026

ATM నుంచి డబ్బులు తీసుకునే ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ATM, పాయింట్ ఆఫ్ సేల్ (PoS) టెర్మినల్స్ ద్వారా నగదు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనలను ఒకే మాస్టర్ డైరెక్షన్‌లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు 2026 నవంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చాయి.

కొత్త మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు తమ కస్టమర్లు నెలలో ఎన్ని ఉచిత ATM లావాదేవీలు వినియోగించుకున్నారో తెలియజేయాలి. ఉచిత లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత చేసే లావాదేవీలపై ఎంత ఛార్జీ పడుతుందో కూడా ముందుగానే కస్టమర్లకు సమాచారం ఇవ్వాలి. దీంతో ATM నుంచి డబ్బులు తీసుకునే సమయంలో అనుకోకుండా అదనపు ఛార్జీలు పడకుండా వినియోగదారులు జాగ్రత్తపడవచ్చు.

RBI 17 పాత సర్క్యులర్లు ఉపసంహరించింది

జర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM, POS క్యాష్ విత్‌డ్రా నిబంధనలను మరింత స్పష్టంగా, ఒకే మార్గదర్శకంలోకి తీసుకొచ్చింది. 2008 నుంచి 2022 మధ్య జారీ చేసిన 17 పాత సర్క్యులర్లను ఉపసంహరించుకుంది.

ఈ కొత్త మాస్టర్ డైరెక్షన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అధీకృత పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు, సంబంధిత వ్యవస్థల్లో పాల్గొనే సంస్థలకు వర్తిస్తుంది.

ATM వినియోగదారులకు ఉచిత లావాదేవీల పరిమితులు, ఛార్జీలు, నగదు ఉపసంహరణ నిబంధనలపై స్పష్టమైన సమాచారం అందించడం ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం.

ఫ్రీ ATM ట్రాన్సాక్షన్లపై బ్యాంకులు అలర్ట్ ఇవ్వాలి

కొత్త RBI మార్గదర్శకాల ప్రకారం, కస్టమర్లు తమ నెలవారీ ఉచిత ATM లావాదేవీలలో ఎన్ని ఉపయోగించుకున్నారో తెలుసుకునేలా బ్యాంకులు తగిన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

ఉచిత లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత తదుపరి లావాదేవీలకు వర్తించే ఛార్జీల వివరాలను కూడా బ్యాంకులు ముందుగానే తెలియజేయాలి. SMS, ATM స్క్రీన్ లేదా ఇతర సమాచార మార్గాల ద్వారా ఈ వివరాలు అందించే విధానాన్ని బ్యాంకులు ఏర్పాటు చేసుకోవచ్చు.

అలాగే ATM మెట్రో ప్రాంతంలో ఉందా? నాన్-మెట్రో ప్రాంతంలో ఉందా? అనే విషయాన్ని ATM స్క్రీన్‌పై సందేశం, స్టిక్కర్ లేదా పోస్టర్ ద్వారా స్పష్టంగా తెలియజేయాలి. ATMల స్థానానికి సంబంధించిన సమాచారాన్ని బ్యాంకులు తమ డేటాబేస్‌లో ఎప్పటికప్పుడు సరిగా అప్‌డేట్ చేయాలి.

Read More: ఆధార్‌లో పేరు అప్డేట్ చేసుకోవాలా..? ఇకపై ఈ డాక్యుమెంట్స్ లేకపోతే కుదరదు.. UIDAI కొత్త రూల్స్

నెలకు ఎన్ని ఉచిత ATM లావాదేవీలు చేసుకోవచ్చు?

RBI కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చినప్పటికీ ప్రస్తుతం అమల్లో ఉన్న ఉచిత ATM లావాదేవీల పరిమితుల్లో మార్పు లేదు. సాధారణ సేవింగ్స్ ఖాతాదారులకు ప్రస్తుతం వర్తించే ఉచిత లావాదేవీల వివరాలు ఇవి.

1. సొంత బ్యాంకు ATM: నెలకు 5 ఉచిత లావాదేవీలు.
2. ఇతర బ్యాంకుల ATMలు – మెట్రో నగరాలు: నెలకు 3 ఉచిత లావాదేవీలు.
3. ఇతర బ్యాంకుల ATMలు – నాన్-మెట్రో ప్రాంతాలు: నెలకు 5 ఉచిత లావాదేవీలు.

ఇతర బ్యాంకుల ATMల వద్ద మెట్రో, నాన్-మెట్రో ప్రాంతాల్లో లావాదేవీలు చేసినప్పుడు వర్తించే ఉచిత పరిమితులపై RBI నిబంధనలు పాటించాలి. ఈ కేటగిరీలను కలిపి ఉపయోగించినప్పుడు మొత్తం ఉచిత లావాదేవీల పరిమితి సాధారణంగా నెలకు 5కి పరిమితం అవుతుంది.

ఈ ఉచిత లావాదేవీల పరిమితిలో నగదు ఉపసంహరణతో పాటు బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా లెక్కలోకి వస్తాయి. అయితే బ్యాంకులు తమ ఖాతాదారులకు అదనపు ఉచిత లావాదేవీల సౌకర్యాన్ని అందించవచ్చు.

ఫ్రీ లిమిట్ దాటితే రూ.23 ఛార్జీ

మీరు నెలవారీ ఉచిత ATM లావాదేవీల పరిమితిని పూర్తిగా వినియోగించుకున్న తర్వాత మరోసారి ATM నుంచి డబ్బులు తీసుకుంటే బ్యాంకులు అదనపు ఛార్జీలు విధించవచ్చు.

RBI నిబంధనల ప్రకారం, ఉచిత పరిమితిని దాటిన ప్రతి అదనపు ATM లావాదేవీకి గరిష్ఠంగా రూ.23 ఛార్జీ వసూలు చేయవచ్చు. దీనికి వర్తించే పన్నులు అదనంగా ఉండవచ్చు.

బ్యాంకులు ఈ ఛార్జీలను విధించేందుకు తమ బోర్డు ఆమోదించిన విధానాన్ని రూపొందించుకోవాలి. అందువల్ల మీ బ్యాంకు వర్తింపజేసే ఛార్జీల వివరాలను తెలుసుకోవడం మంచిది.

ATM ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఛార్జీలు ఉండవు

ATM నుంచి డబ్బులు తీసుకునే సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే, కొన్ని సందర్భాల్లో లావాదేవీ విఫలమవుతుంది. ATMలో నగదు లేకపోవడం, హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ సమస్యలు, కమ్యూనికేషన్ లోపాలు వంటి కారణాలతో ఫెయిల్ అయిన లావాదేవీలను చెల్లుబాటు అయ్యే ATM లావాదేవీలుగా పరిగణించకూడదని RBI స్పష్టం చేసింది.

బ్యాంకు లేదా సేవా సంస్థకు సంబంధించిన సమస్యల వల్ల విఫలమైన లావాదేవీలకు ఛార్జీలు విధించకూడదు. అలాగే ఇటువంటి లావాదేవీలు ఉచిత ATM లావాదేవీల పరిమితిలో కూడా లెక్కించకూడదు.

ATMల వద్ద గరిష్ఠ నగదు ఉపసంహరణ పరిమితులు, ఉచిత లావాదేవీల వివరాలు, ఛార్జీల సమాచారాన్ని ఇంగ్లీష్, హిందీ, స్థానిక భాషల్లో ప్రదర్శించాలి.

POS మెషీన్ల ద్వారా కూడా నగదు తీసుకోవచ్చు

RBI కొత్త మార్గదర్శకాల్లో POS మెషీన్ల ద్వారా నగదు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనలను కూడా స్పష్టంగా వివరించింది. నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా డెబిట్ కార్డులు, పూర్తి KYC కలిగిన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI), UPI ద్వారా POS టెర్మినల్స్ వద్ద నగదు తీసుకునే సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి తప్పనిసరిగా ఏదైనా వస్తువు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అర్హత కలిగిన వ్యాపార సంస్థల వద్ద ఈ నగదు ఉపసంహరణ సేవ అందుబాటులో ఉంటుంది.

POS క్యాష్ విత్‌డ్రా పరిమితులు ఇవే

POS మెషీన్ల ద్వారా నగదు తీసుకునే వారికి RBI నిర్దేశించిన పరిమితులు ఇలా ఉన్నాయి.

1. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా: రూ.2,000.
2. నెలవారీ గరిష్ఠ పరిమితి: అన్ని ప్రాంతాల్లో కలిపి రూ.10,000.
3. విధించే ఛార్జీలు: ఉంటే లావాదేవీ మొత్తంలో 1 శాతానికి మించకూడదు.

ఒకవేళ కస్టమర్ వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు నగదు కూడా తీసుకుంటే, కొనుగోలు చేసిన వస్తువుల ధర, ఉపసంహరించిన నగదు మొత్తాన్ని రసీదులో విడివిడిగా చూపించాలి.

బ్యాంకులు తమ బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం ఈ సదుపాయాన్ని అందించాలి. వ్యాపార సంస్థల వివరాలను కూడా పరిశీలించాలి.

Read More: Jan Aushadhi Kendra: జన ఔషధి కేంద్రం ప్రారంభిస్తే మంచి ఆదాయం.. మహిళలు, SC/STలకు ₹2 లక్షల వరకు ఆర్థిక సహాయం!

ATMలో UPI ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా

ATMలలో UPI ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా సదుపాయానికి సంబంధించిన నిబంధనలను కూడా RBI కొనసాగించింది. ఈ విధానంలో కస్టమర్ UPI ద్వారా లావాదేవీని ధృవీకరించవచ్చు. నగదు ఉపసంహరణకు సంబంధించిన సెటిల్‌మెంట్ ATM నెట్‌వర్క్ లేదా National Financial Switch ద్వారా జరుగుతుంది.

ATM వినియోగదారులు ఏం చేయాలి?

RBI కొత్త మార్గదర్శకాలతో ATM లావాదేవీల విషయంలో మరింత పారదర్శకత తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉచిత ATM లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత ఛార్జీలు పడే అవకాశం ఉన్నందున, కస్టమర్లు తమ నెలవారీ ATM వినియోగాన్ని గమనించడం మంచిది.

ATM నుంచి తరచుగా డబ్బులు తీసుకునే వారు తమ బ్యాంకు ఉచిత లావాదేవీల పరిమితి, అదనపు ఛార్జీలు, ATM నగదు ఉపసంహరణ పరిమితుల వివరాలను తెలుసుకోవాలి. కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు అందించే అలర్ట్‌లను గమనిస్తే అనవసర ఛార్జీలను నివారించుకోవచ్చు.

Sunil Kumar

I am to Provide Reliable, Accurate and useful information on government schemes, job notifications, education news, scholarships and latest updates based on official sources.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Central Government Holidays 2027

Central Government Holidays 2027 : 2027లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుల జాబితా విడుదల.. మొత్తం హాలిడేస్ ఇవే!

November 27, 2026
Mahindra Sarathi Scholarship 2026-27

Mahindra Sarathi Scholarship 2026-27: 10వ తరగతి తర్వాత చదివే బాలికలకు ₹10,000 స్కాలర్‌షిప్.. నవంబర్ 30 వరకు దరఖాస్తులు!

November 26, 2026
8th Pay Commission Update

8th Pay Commission Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు? వార్షిక ఇంక్రిమెంట్ 3% నుంచి 6%కి పెంచాలని డిమాండ్!

November 25, 2026
AP Rice Price Update

AP Rice Price Update: డిసెంబర్ 1 నుంచి రేషన్ షాపుల్లో తక్కువ ధరకు పప్పు, గోధుమ పిండి, పామాయిల్.. బియ్యం ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

November 23, 2026
Motor Insurance Rules

Bike, Car Owners Alert: డిసెంబర్ 15 నుంచి కొత్త Motor Insurance Rules.. బీమాలో 4 విభాగాలు!

November 18, 2026
Gold Loan Rules

Gold Loan Rules: బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం పోయినా, పాడైనా పరిహారం పొందవచ్చు! RBI కొత్త రూల్స్ ఇవే

November 15, 2026

Leave a Comment